12, డిసెంబర్ 2016, సోమవారం

మెషిన్ ఆల్వేస్ ఫెయిల్స్

అనేవాడు కాలేజీలో మా మాస్టారు.
యంత్రం అన్న తరువాత అది అదేవిధంగా ఎల్లకాలం పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు అనేది ఆయన భావం. ఎప్పుడన్నా పనిచేయక పోవచ్చు, అనడానికి, ఎప్పుడూ పనిచేయదు అనడానికి ఏదో తేడా వుంది అని ఇప్పుడు అర్ధం అవుతోంది కానీ చదువుకునే రోజుల్లో మాస్టారి మాటే వేదం కనుక ఆ మాటే ఇప్పటికీ గుర్తుండిపోయింది.
ఇవాళ మధ్యాన్నం ఏదో పనిమీద బయటకు వెళ్లి తిరిగి రావడానికి ఊబెర్ బుక్ చేయబోతే మొరాయించింది. కార్డు ప్రాబ్లం అంటూ ఏదో మెసేజ్ చదివేలోగానే మాయమై పోతోంది. సమస్య ఏమిటో అర్ధం కాలేదు కానీ ఈ పూటకి ఊబెర్ ప్రాప్తం లేదనుకుని ఆటోని ఆశ్రయించాను. ముందు నూట ఇరవై అని, ఇరవై నా దగ్గర చిల్లర వుండదనుకున్నాడో ఏమో వందకి ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే AM- ATMSBI పేరిట ఓ ఎస్సెమ్మెస్. “Dear Customer. Your txn at POS ……….declined as account is inoperative or locked. Please contact your branch for resolution.”
ఒకటయితే చూడను అనుకున్నారేమో వరసగా నిమిషానికి ఒకటి చొప్పున మొత్తం నాలుగు పొట్టి సందేశాలు. పక్కనే పేపర్లో ‘కార్డు గీకండి, కోటి గెలవండి” అని వెక్కిరింత వ్యాఖ్య.
ఈరోజు బ్యాంకుకు సెలవు, వరసగా మూడు రోజుల తరువాత రేపు తెరిస్తే అక్కడ ఎలా వుంటుందో ఏమో!
నా ఎక్కవుంటు   inoperative లేక locked అనే విషయం తెలుసుకోవడానికి పడుతూ లేస్తూ బ్యాంకుకు వెళ్ళాలా! ఇంటి నుంచి ఆన్ లైన్లో తెలుసుకునే ఏర్పాటు ఎందుకు చెయ్యరు?
పొద్దున్న ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు   operative గా వుండి lock కాకుండా వున్న ఎక్కవుంట్ వున్నట్టుండి ఎలా inoperative అయింది లేదా lock అయింది.
పైగా అదే  బ్యాంకులో, అదే బ్రాంచిలో నేను 1975 నుంచి అక్కవుంట్ హోల్డర్ని. ఒక్కసారి కూడా defaulter  అనే ముద్ర నా మీద పడలేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు కూడా నేను ఆ బ్యాంకుతో అనుబంధం తెంచుకోలేదు. పదేళ్లకు పైగా నా పెన్షన్ అక్కవుంట్ కూడా అక్కడే వుంటోంది. ఇవన్నీ సరే! నేను ఒక సాధారణ పౌరుడ్ని. అంతే అనుకుందాం పోనీ.
 ఇటువంటి సందేశాలు వరస వెంబడి నాలుగు పంపించిన బ్యాంకు వాళ్ళు అసలు విషయం ఏమిటో ముందే ఎందుకు తెలియచేయలేదు? మొత్తం అన్ని పనులు ఇంటి వద్దనుంచే ఆన్ లైన్లో చక్కబెట్టుకోవచ్చు అంటున్నప్పుడు మళ్ళీ ఈ పిలుపులు ఏమిటి.?
మొత్తం దేశం ఆన్ లైన్ వైపు ప్రయాణిస్తుంటే నేను బ్యాంకుకి వెళ్ళకుండా అదే విధానంలో పరిష్కారం చూపెట్టలేరా?
నాకు తెలుసు ఇవన్నీ జవాబు దొరకని  భేతాళ ప్రశ్నలని.
తెలిసి చెప్పక పోయినా ఎవరి తలలు పగలవు, ఆలోచించి ఆలోచించి మన తలలు పగలడం తప్ప.

3 కామెంట్‌లు:

మనోహర్ చెనికల చెప్పారు...

Somebody might have tried to login to account unauthorized.

అజ్ఞాత చెప్పారు...

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టూ అవతలి దేశం ఏదో చేసింది, మేమూ చేస్తాం అని తలా తోకా లేకుండా ఏ ప్రణాలికా లేకుండా చేస్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు.

నా బేంకు పాస్ వర్ద్ పనిచేయడం ఆగిపోయి ఏడాది దాటుతోంది. వేరే దేశాన్నుంచి ఫోన్ చేయాలంటే అర్ధరాత్రి రెండు దాకా కూర్చోవాలి. తీరా కూర్చుని చేస్తే ఎవడొ ఛాప్రాసి ఎత్తి, 'ఇక్కడెవరూ లేరు ఫో' అని పెట్టేస్తాడు. ఖాతాలో ఎన్ని డబ్బులున్నాయో తెలుసుకోవాలంటే ఎవర్నో పట్టుకుని బతిమాలాలి.

బేంకు ప్రజల డబ్బుల్తో నడుస్తుంది కానీ ఆ డబ్బులు దాచుకున్న ప్రజ బేంకులోకి వెళ్తే చీడపురుగుని తీసి విసిరేసినట్టు మాట్లాడతారు. వెబ్ సైట్లలో రీజినల్ మేనేజర్ దగ్గిర్నుంచి ప్రతివాడి ఈమెయిలూ ఉంది. మెయిల్ పంపిస్తే దానికి సమాధానమే రాదు. ఇప్పటికి అలా మెయిళ్ళు పంపించి అయిదు సంవత్సరాలు అవుతోంది. కానీ నెలకో సారి బేంకు ప్రబుద్ధులు 'ఇలా జరిగింది, ఇంత చేసాం, అంత చేసాం' అని నాకో మెయిల్ పంపుతారు. అది ఆటోమేటిగ్గా సెట్ అప్ చేసారని రెండేళ్ళ కుర్రాడిక్కుడా తెలుసు. ఇదీ మన దౌర్భాగ్యం

అజ్ఞాత చెప్పారు...

Anon
u r at fault, why u v failed 2 compalin the matter 2 ombuds man?