4, జులై 2016, సోమవారం

మందు ఎక్కడ దొరుకుతుంది ?


“డాట్టరు గారూ! మీ  ఫీజు సరే కానీ  మీరు  రాసిన ఈ మందులు ఎక్కడ దొరుకుతాయండీ?”
“అదే మరి కాలేది. అవతల అంత మంది పేషెంట్లు వుంటే  ఏవిటీ చచ్చు, చొప్పదంటు ప్రశ్న?”
“అలా కోపం చేసుకోకండి. మీరు పెద్దమనసుతో వింటానంటే చెబుతా!”
“అదేదో తొందరగా చెప్పి ఏడవ్వయ్యా మగడా!”

“మొన్నీమధ్య మా బామ్మర్ది ఆడి బామ్మర్ధికి ఒంట్లో నలతగా వుంటే మీ దగ్గరికే పంపించాకదండీ. మీరేమో మంచిగా చూసి మాత్తర్లు అవీ రాసిచ్చారు కదండీ. వాడేమో ఆ చీటీ పట్టుకుని వూళ్ళో సగం మందుల షాపులు చుట్టేశాడండీ! కానేమోనండీ ఒక్క చోట దొరికితే ఒట్టండీ. ఒకడేమో అదే మందు గోలీలు వేరే కంపెనీవి వున్నాయంటాడు. మీరు  కోప్పడతారనుకుని వేరే షాపుకు వెళ్ళాడండీ. ఆడేమో వందా నూటయాభయ్యా అని అడిగాడుటండీ. వందలూ, ఏలూ మాత్తర్లు నాకెందుకయ్యా  నీలాగా దుకాణం వుందనుకున్నావా అన్నాట్ట మా వోడు. దుకాణపోడు పెద్దగా నవ్వి, అదికాదయ్యా బాబూ పవరు, మాత్తర్ల పవరు యెంత నూరా నూట యాభయ్ ఎంజీలా అని అడిగాట్ట. ఆ పవర్లు మీ డాట్టారు రాయలేదు ముందు పోయి కనుక్కో. తర్వాత వచ్చి మందు కొనుక్కో అన్నాట్టండీ. ఫీజు వంద అంటే ఇచ్చాము కానీ ఈ మాత్తర్లకు కూడా ఇంత ఇసయం వుందా అని మా ఓడు తెగ మనాది పడిపోయి ఆ మాత్తర్ల కోసం తిరిగి తిరిగి చివరికి కొననేలేదు. వాడనేలేదు. కానండీ మీ చేయి వాసి  మహా గొప్పది కదండీ, అంచేత వాడికి జబ్బు చేత్తో తీసేసినట్టు తగ్గిపోయిందండీ!”         

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీరు సరదాకి వ్రాసారేమో ఈ పోస్ట్, కానీ వాస్తవంలో జరిగేదేమిటో మీకూ తెలుసుగా? మీ కధలో మనిషి మందుల కోసం ఊరంతా తిరిగే బదులు ఆ డాక్టర్‌గారి క్లినిక్‌కి అనుబంధంగా ఉన్నదో, క్లినిక్ పక్కనే ఉన్నదో మందుల షాపులో ప్రయత్నిస్తే దొరికిపోయేవి 99%. డాక్టర్లు వ్రాసే ప్రిస్కిప్షన్లు చాలా వరకు అలాగే ఉంటున్నాయి కదా. వైద్యో నారాయణో .........

Unknown చెప్పారు...

tappu narasimha rao gaaru...mandula shop eppudu doctor gare petti mandulu ammutunnaru maa guntur lo kavalante vaakabu cheyandi

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నేనన్నదీ అదే కదా రెడ్డి గారూ ☹️ 🤔 ! గుంటూరే కాక అధికశాతం ఊళ్ళల్లోనూ అదే పరిస్ధితి కదా ఈ రోజుల్లో. వ్యాపారాలండీ వ్యాపారాలు. వ్యాపారాల వలనే అభివృద్ధి వీలవుతుందని ఎక్స్‌పర్ట్‌లు చెబుతుంటారు కదా.