14, మార్చి 2016, సోమవారం

సాగర సాయంత్రం


బతికితే అలా బతకాలి అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు. నాకు మాత్రం అనిపిస్తోంది జర్నలిష్టు అనేవాడు చనిపోతే అరుణ్ సాగర్  లా చనిపోవాలని.



మరోటి కూడా అనిపించింది, సాగర్  చనిపోలేదేమో.....నిన్న ఆదివారం రాత్రి హైదరాబాదులో సాగర్ మిత్రులు ఏర్పాటు చేసిన ‘ఏ షామ్ ....సాగర్ కే నామ్’ ప్రోగ్రాం చూసిన తరువాత.  అంత మందిలో ఎక్కడో అక్కడ ముచ్చట్లు చెబుతూ, బాతాఖానీ వేస్తూ సరదాగా టైం పాస్ చేస్తున్నాడేమో.  


చిన్నతనంనుంచీ పెద్ద సంఖ్యలో  సంపాదించుకున్న స్నేహితులు అందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన దెవరు అనేకంటే రానిదెవ్వరు చెప్పడం తేలిక.
సాగర్  ఇష్టపడే మనుషులు తాము ఇష్టపడే సాగర్ గురించిన కబుర్లు చెప్పుకుంటూ, సాగర్ కు ఇష్టమైన పాటలు వింటూ కాలక్షేపం చేసారు.  సాగర్ ఇష్టపడేవన్నీ అక్కడ  ఏర్పాటు చేశారు. అలా ఆ సాయంత్రం వచ్చిన అందరికీ సాగర్ నామస్మరణతో గడిచిపోయింది.

ఒక మనిషి జీవితానికి ఇంకేం ధన్యత కావాలి. అరుణ్ సాగర్ ఆ విధంగా ధన్యుడు. (14-03-2016)

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


సాగర్ గారికి నివాళి !

యాభై దాటని వసంతం లో ఇరవై ఐదు వసంతా ల జర్నలిస్ట్ కి నివాళి !

సాగర ! సాయం త్రారుణి
సాగర కాదుగ ? అకాల సాగర ముయనన్
నీ గురుతు మము వదలదుర
ఆగుమ ! ఎక్కడికి నీ పయానము తెలియన్ ?

జిలేబి