7, సెప్టెంబర్ 2015, సోమవారం

పెద్ద గీత - చిన్న గీత

స్టేట్ బ్యాంక్ సీజీఎం గా  రిటైర్ అయి హైదరాబాదులో స్థిరపడ్డ ఓ పెద్దమనిషి బ్యాంక్ ప్రొబేషనరీ అధికారుల ఇంటర్వ్యూ బోర్డు చైర్మనుగా గత రాత్రి  ఒడిసా రాజధాని భువనేశ్వర్ కు వెళ్ళారు. మూడు  దశాబ్దాల క్రితం ఆ రాష్ట్రం  కొత్తగా ఏర్పడ్డప్పుడు కొత్తగా కట్టిన రాజధానీ నగరం అది. భువనేశ్వర్ విమానాశ్రయం పూర్వం బేగం పేట ఎయిర్ పోర్టు మాదిరిగా వుంటుంది. ఇంతవరకూ ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం వైభోగం లేదు. హైదరాబాదు నుంచి వెళ్ళిన బ్యాంకు మాజీ అధికారి  విమానం దిగి ఎయిర్ పోర్టులో ఎస్కలేటర్ ఎక్కగానే కరెంటు పోయింది. విమానాశ్రయంలో కరెంటు పోవడం ఆయనకు తొలి అనుభవం. ఎయిర్ పోర్టు నుంచి గెస్టు హౌస్ కు వెళ్ళేవరకు దారిలో అనేక పర్యాయాలు కరెంటు పోవడం రావడం జరుగుతూ వచ్చింది. ఇక ఆ రాత్రి గెస్టు హౌస్ లో గడిపిన తరువాత  అక్కడ తరచుగా వాటిల్లే కరెంటు అంతరాయాలకు  ఆయన పూర్తిగా అలవాటు పడిపోయారు.
నవీన్ పట్నాయక్ ఒడిసా రాష్ట్రపు ముఖ్యమంత్రి. బాగా చదువుకున్నవాడు. పేరుకు తగ్గట్టే నవీన భావాలు కలిగినవాడు. అవినీతి మచ్చలు పడనివాడు. ఆయన నేతృత్వంలో బిజూ జనతా దళ్ వరసగా మూడో పర్యాయం అధికారంలో కొనసాగుతోంది. చక్కటి పరిపాలకుడు అని ప్రజలు విడవకుండా పట్టం కడుతున్న ఆ రాష్ట్రంలో కరెంటు పరిస్తితి అది.
ఆ రాష్ట్రాన్ని చూసి పరవాలేదు మనమే నయం అనుకోవాలా?         


6 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

@Bhandaru Srinivasrao:

"మూడు దశాబ్దాల క్రితం ఆ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పుడు కొత్తగా కట్టిన రాజధానీ నగరం అది"

ఒడీషా రాష్ట్రం 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1936లొ (మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా) ఏర్పడింది. అప్పటిలో కటక్ నగరం రాజధానిగా ఉండేది. 1946లొ కటక్ నుండి 30 కిమీ దూరంలో భుభనేశ్వర్ పేరుతొ అధునాతన నగర నిర్మాణం మొదలయ్యింది. మరో రెండేళ్లకు రాజధాని భుభనేశ్వర్ నగరానికి మారింది.

మూడు దశాబ్దాలు అని సదరు ఉన్నత అధికారి పేరుకొన్నా మీరే అనుకున్నా వాస్తవం కాదు. రాష్ట్రం ఏర్పడి 8 దశాబ్దాలు & నగరం దాదాపు 7 దశాబ్దాలు గడిచాయి.

"పరవాలేదు మనమే నయం అనుకోవాలా?"

ఈ విషయంలో భుభనేశ్వర్ మాత్రమె కాదు మాజీ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్తితి కంటే ఈనాటి హైదరాబాదు ఎంతో మెరుగు. ఎంతో మంది నగరవాసులు (కిరణ్ కుమార్ రెడ్డి సంగతి తెలీదు) కరెంటు కోతలంటే ఏమిటో దాదాపు మరిచిపోయారు.

అజ్ఞాత చెప్పారు...

This year there is lot of surplus power in the power exchange and power price down to 2rs/unit in the exchange. So andhra dont want to pull the power to telangana as they are getting 3.5+Rs for the power. Thats the key for uninterrupted power ;-)

నీహారిక చెప్పారు...

ఆంధ్రాలో చంద్రబాబు,కేంద్రంలో మోడీ కూడా అలాంటివాళ్ళే !
ఏ చెట్టూ లేనపుడు ఆముదం చెట్టే మహావృక్షం కదా ?

Unknown చెప్పారు...

I am in Orissa right now. In our village, we do not have power supply during day time. During day time, I stay in my farm and supervise the works. My farms gets water from a drain and I don't need to use electric motor pump. Therefore I face no troubles by power cuts here.

అజ్ఞాత చెప్పారు...

@ Anonymous If power is so cheap, why Karnataka is struggling now? We have (officially) 3-4 hours power cut in Bangalore now.

అజ్ఞాత చెప్పారు...

@bonagiri, Bangalore's problem is Bescom. For hyderabad TS/old AP used to shut entire state and give power to HYD.

For the case of bangalore Bescom is separate company spinned off for urban region and does not redirect entire state's power like for hyderabad.