21, సెప్టెంబర్ 2015, సోమవారం

?



ఏకాంబరం  ఆఫీసు పనిలో బిజీగా వున్నప్పుడు  క్రెడిట్ కార్డు నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డెబిట్ అయినట్టు ఎలర్ట్ మెసేజ్ వచ్చింది. వెంటనే చేస్తున్న పని ఆపి భార్య సెల్ కి కాల్ చేసాడు.
‘ఏమిటి అప్పుడే తెల్లారిందా! షాపింగు కోసం ఊరిమీద పడ్డావ్. ఏం కొన్నావ్ అంత డబ్బెట్టి? పట్టు చీరెలా!’

‘కాదు. ఉల్లిపాయలు’  

2 కామెంట్‌లు:

Vamshi Pulluri చెప్పారు...

మీ జోక్ బాగుంది..ఈ మధ్య "ఉల్లి" పైన ఎన్నో జోకులు..
కాని, మరో విధంగా ఆలోచిస్తే..
..చాల సార్లు, మనం ఉల్లిగడ్డలు Rs.20/ కిలో , లేక అంత కంటే తక్కువ ధర లో కొన్నాం. అది కుడా మన ఇంటి దగ్గర షాప్ లో, అవి కూడా మనం ఏరుకొనే సదుపాయం (graded-higher quality), కొంత dry అయినవి..అవే మనకు ఇరవై రూపాయలకు దొరుకుతుంటే, షాప్ వాడికి ఎంత లో దొరికుంటాయి.! మన సిటి లోని హోలసెల్ మార్కెట్ లో ఎంత ఉండొచ్చు.! రవాణ, దళారీ కర్చులు మినహాయిస్తే, రైతు కి ఎంత ధర వచ్చుంటుంది..ఎంత
?? మహా అయితే, రూపాయో, రూపాయినర్రో .! అది ఉల్లి పీకే కూలి కర్చులకు కుడా సరిపోవు..!
మీరు టమాట, మరో కురగాయలో పది, ఇరవై లలో కిలో (సిటి లో మన ఇంటి పక్కన) దొరుకుతుంటే, మీరు అర్థం చేసుకోవచ్చు..అక్కడ రైతు పూర్తిగా, దారుణంగా మునిగి పోయాడని.!
ఉల్లి "రాజకీయ" కూరగాయ అయిపోయింది..అందుకే, సబ్సిడీ లో రైతు బజార్ ఏర్పాటు చేసి మరి అమ్ముతోంది ప్రభుత్వం. ధరలు దారుణంగా పడిపోయినప్పుడు, అదే కిలో కీ ఇరవై రూపాయలు చొప్పున ప్రభుత్వం రైతు దగ్గర కొంతుందా?
టమాట ధర పెరిగినప్పుడు సబ్సిడీ ఇస్తుందా?? అది రోజు వాడుకొనే కూరగాయ కాదని అందామా. కాని, నెలలో ఎన్ని కిలోల ఉల్లి వాడుహ్తారు?? ఎన్ని కిలోల టమాట, వంకాయ వాడుతారు? ఇంచుమించు అంతే సమానంగా కదా.! మరి ? అప్పుడెప్పుడో, డిల్లి లో ఉల్లి ధర వాళ్ళ ప్రభుత్వానికి గండం వచ్చిందని, ఉల్లి కి ఒక రూల్?? మిగితా వాటికి మరో రులా??

ప్రతి వస్తువు అమ్ముడు పోవాలంటే దానికి క్రేజీ పుబ్లిసిటీ కావలి.. ఇప్పుడు మనం చేస్తుంది అదే..
మీడియా, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరు ఉల్లి ధర ల పైన జోకులు వేసి, మార్కెట్ కి కొత్త జీవం పోస్తున్నారు. మార్కెట్ మాయాజాలం లో మరింత రేట్ పెరిగి, రిటైలర్ మాల్ వాళ్ళకు, మధ్య లోని వారికి మరింత ఉచిత పబ్లిసిటీ చేస్తున్నామే..పాపం రైతు కి ఇందులో ఒక రెండు రూపాయలు వచ్చి ఉంటాయి. ఇప్పటి వరకు పెరిగిన ధర రైతు కి చేరి ఉండదు.ఇప్పటి నుండి రేట్ పెరిగితే, అది రైతు కే వెళ్తుంది.కాబట్టి..రేట్ ఇలాగే ఉండాలని మనసార కోరుకొంటున్నాను..
పెరిగిన ధర వాళ్ళ పెరిగిన భారం, మహా అయితే నెలకు మరో వంద, రెండు వందలు.! నేనే కాదు మీరందరు హాయిగా ఆ వంద కర్చు పెట్టొచ్చు..!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Vamshi Puluri - మీరు రాసింది వాస్తవం. నేను రాసింది కేవలం జోకు మాత్రమె.- భండారు శ్రీనివాసరావు