17, ఆగస్టు 2014, ఆదివారం

దటీజ్ బాపు. బాపు ది గ్రేట్.


ముళ్ళపూడివారి 'కోతికొమ్మ'చ్చికి  ఆయన అభిమాన బృందం  అభిమాన  పురస్సర  కొనసాగింపే 'కొసరు కొమ్మచ్చి' పుస్తకం.   వెల కేవలం రెండువందలు. కేవలం ఎందుకంటున్నానంటే - ఇందులో అక్షరలక్షలు విలువ చేసే బాపూగారి  'రమణా నేనూ, మా సినిమాలు' అనే ముందుమాట వుంది.(ప్రతులకు నవోదయా) ఎదుటివాడిమీద  జోకులేసి నవ్వుకోవడం కాదు, మన మీద మనమే జోకులేసుకుని నవ్వించే గుణం వుండాలి అనే బాపూ గారి మానసిక ఔన్నత్యానికి ఇదిగో ఒక మచ్చు తునక:
బాపూ గారి ఉవాచ:
"శంకరాభరణం ఎనభయ్ మూడోమాటు చూడ్డానికి దియేటర్ కు వెళ్ళినపుడు ఇంటర్ వెల్ లో ఇద్దరు కాన్వెంటు పాపలు పరుగునవచ్చి బుల్లి మఖమల్ అట్ట పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. 'పెన్ను లేదమ్మా' అన్నా. ఓ పాప బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి అందులోనుంచి పెన్సిల్ తీసి ఇచ్చింది. నేను సంతకం పెడుతుంటే చూసి, 'మీరు విశ్వనాద్ గారు కారా'  అనడిగింది. 'కాదమ్మా' అన్నా. ఆటోగ్రాఫ్ పుస్తకం లాక్కుని,  ఫ్రెండుని 'ఒసే. బాక్సులో లబ్బరు వుంటుంది ఇలా తే' అంది"
దటీజ్ 



      

5 కామెంట్‌లు:

nagasrinivas చెప్పారు...

నేనుకూడా చదివానంది ఇది. కినిగేలో డిగిటల్ పుస్తకంకూడా దొరుకుతొంది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@nagasrinivas - సంతోషం 'బాపు' అని కనబడితే చదవని బాపు అభిమానులు ఎవ్వరు?

Saahitya Abhimaani చెప్పారు...

Yes! Bapu is great, really GREAT.

Raj చెప్పారు...

Is Bapu from Andhra or Telangana??
:-) :-)

అజ్ఞాత చెప్పారు...

india