5, డిసెంబర్ 2013, గురువారం

పీర్లు గుండాన పడ్డాయి


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విధానం (ప్రాసెస్) మొదలయిందని  సుమారుగా నాలుగేళ్ల క్రితం అంటే 2009  డిసెంబర్ తొమ్మిదో తేదీన నాటి హోం మంత్రి చిదంబరం బహిరంగంగా ప్రకటన చేసిన తరువాత మళ్ళీ ఇన్నేళ్ళకు ఓ నాలుగు రోజులు ముందుగానే ఈనాటి  కేంద్ర హోం మంత్రి షిండే కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ బిల్లును క్యాబినెట్ ఆమోదించిందని  ఇంకో ప్రకటన చేసారు.  దరిమిలా టీవీల్లో చర్చోపచర్చలు అనంతంగా సాగాయి.

ఇల్లలుకగానే పండగ కాలేదని, పార్లమెంటులో బిల్లు పాసయినప్పటి మాట కదోయి నాయనా!అంటూ  కొందరు పాత  పల్లవినే కొత్తగా ఎత్తుకుంటే,  కేంద్ర కాబినెట్ నిర్ణయంతో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినట్లేగాఇంకా అనుమానాలు ఎవరికైనా వున్నాయాఇంకా మభ్య పెట్టేవారిని ఏమనాలి?అంటూ మరికొందరు డౌటేహులు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.



రాష్ట్ర విభజనను మనసారా కోరుకునే వారు తెలంగాణలో నూటికి తొంభయ్ తొమ్మిది శాతం మంది వుండవచ్చు. అలాగే  సమైక్య రాష్ట్రాన్ని కావాలనుకునేవారు జనాభాలో అధిక సంఖ్యాకులు వుండవచ్చు. ఎలాగయినా పరవాలేదు రాష్ట్రాన్ని చీల్చినా సరే ఇప్పటిమాదిరిగా వుంచినా సరే మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిఅనే వాళ్లు కనీసం ఒక శాతం అయినా వుంటారు. వోట్ల పండుగలో గుర్తుకువచ్చే ఈమాదిరి  అల్పసంఖ్యాకులు అసలు ఇలాటి సమయాల్లో అసలే గుర్తుకురారు.
రాష్ట్రాన్ని రెండుగా చీల్చాలి.  ఓకే. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కాదన్నవాడికి కర్రు కాల్చి వాత పెట్టండి.
రాష్ట్రం సమైక్యంగా వుండాలి. మరీ ఓకే!  కాదుకూడదు అని నిర్ణయాలు తీసుకున్నవారిని సోదిలోకి లేకుండా తరిమి కొట్టండి.
మీచేతిలో వజ్రాయుధం పెట్టుకుని, అట్ట ఆయుధాలతో ఆటలు ఆడుతున్న రాజకీయనాయకులను చూసి భయపడాల్సిన ఖర్మ మీకేమిటి?
ప్రజాస్వామ్యంలో నాయకులు గొప్పవాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళను గొప్పవాళ్ళను చేస్తున్నది మాత్రం మన జనమే!

(05-12-2013) 

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

సీ || లెక్కకు మిక్కిలి యైనను కొద్ది తే
డా సైత ముందని రాజకీయ

పార్టీలు గల జాతి, పటుతరమౌ స్వార్ధ
మున జను ల్విడిపోయి మలిన పడ్డ

జాతి, కలహముల కాపురమై పరు
లకు రాజ్య మిచ్చియు లేశమైన

సిగ్గు నేర్వని జాతి, శిష్ట జనుల రక్ష
జేయు సంకల్పము లేని దేబె

తే || ప్రభువులను భరించెడు జాతి – క్రమ వినాశ
నానికి గురియై, తేజము నీరసించి
శత్రువులకు నవ్వు గొల్పును – చవటలు తెగ
పెరిగి దొంగల దోపిడి వెల్లువౌను.
(హరి.S.బాబు:05/05/1993)
యెంత ఘోరం! ఇవ్వాళ తెలుగు వాళ్ళ పరిస్తితి ఇంత దయనీయంగా తయారయిందేమిటి?తొమ్మిదేళ్ళ పాటు ఉద్యమం చేసి ఆ లక్ష్యాన్ని చేరుకోబొయే అఖరి నిముషంలో కూడా అవహేళనకి గురవుతున్నారెందుకు?విభజనని వ్యతిరేకించే వాళ్ళ సంగతి అలా ఉంచీతే విభజనని కోరుకున్న వాళ్ళ మాట కూడా హస్తినలో చెల్లుబాటు కావడం లేదెందుకు?
బహుశా “రాయల తెలంగాణా” గురించి కాంగ్రెసు ప్రకటించగానే అందరిలోనూ ఇలాంటి ఆశ్చర్యంతో కూడిన వ్యతిరేకతే ఒచ్చి ఉండొచ్చు.కానీ నాకు మాత్రం ఆశ్చర్యం అనిపించలేదు.ఇలాంటిదేదో జరుగుతుందని కచరా విలీనం ఒప్పందంతో తెలంగాణా ప్రకటన జరిగాక విలీనానికి నో అన్నపుడే నాకు అనుమానం వొచ్చింది,

మొత్తం చదవాలంటే ఇక్కడ చూడండి:http://kinghari010.blogspot.in/2013/12/2.html