17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఒక్క అయిదు నిమిషాలు మీవి కావనుకుంటే......

.......... ఓ అద్భుత ప్రపంచం మీ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. కుర్చీలో కూర్చుని చేతుల్లో సంగీత వాయిద్యాలు వుంచుకుని చైనా యువతులు చేసే విన్యాసాలు అపూర్వం. ఇందులో అంత ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటారా? కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటారు కాని అక్కడ కుర్చీలే వుండవు. యోగాసనాలతో అలా కాళ్ళు ముడుచుకుని కూర్చుంటారు. అంతసేపు అలా యెలా వుండగలిగారు ? మానవ మాత్రులకు ఇది సాధ్యమయ్యే పనేనా? చూసి తెలుచుకోండి. ఆసక్తి వుంటే కింది లింక్ పై క్లిక్ చేయండి.

http://www.youtube.com/watch_popup?v=6HfDeTVpinU&vq=medium

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

యోగాసనాలు కావనుకుంట , ఏదో మేజిక్ ఉంటుంది .
అలా నింపాదిగా కూర్చోవడం చూస్తుంటే ఏదో ఉంటె ఉంటుంది .

Rao S Lakkaraju చెప్పారు...

గాలి లోకి ఎగరటం కూడా యోగాయే అంటారా? చైనా వారి మాయ. కళ్ళకి కెమెరాకి కనపడకుండా ఉండే వాటిని ఉపయోగించారని నా ఊహ.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Rao S Lakkaraju,@అజ్ఞాత - పూర్వం సురభి వాళ్ల నాటకాల్లో నారదుడు ఆకాశం నుంచి దిగివచ్చినట్టు స్టేజి పై దిగేవాడు. కంటికి కనబడని తీగెలు వాడేవాళ్ళు. కానీ చూసేవాళ్ళకు ఎక్కడలేని 'త్రిల్'. దీనికి సమానార్ధకం అయిన తెలుగు పదం చటుక్కున తట్టలేదు.క్షమించాలి. ఈ నాటి తరం ఆ 'త్రిల్' పోగొట్టుకుంటోంది. నిరుడో, ముందటేడో అనుకుంటాను సర్కార్ మేజిక్ షోకి వెళ్ళాము. వాళ్లు యేది చూపెట్టినా అక్కడి పిల్లలు ఇదంతా మేజిక్ అని కొట్టి పారేస్తున్నారు. మేజిక్ షోలో మేజిక్ కాక మరేముంటుంది. అందుకే ముందే చెప్పాను. ఆస్వాదించండి అని. వాళ్లు యోగా ద్వారా చేశామంటున్నారు.అంతవరకూ సంతోషించాలి కదా!