1, ఫిబ్రవరి 2011, మంగళవారం

నిమ్మకాయ మంత్రం కాదు – భండారు శ్రీనివాసరావు

నిమ్మకాయ మంత్రం కాదు – భండారు శ్రీనివాసరావు


ఇదేదో నిమ్మకాయ మంత్రం కాదు కానీ, నిమ్మకాయతో కేన్సర్ ని నయం చేయవచ్చంటున్నారు బాల్టిమోర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు. ఎన్నో రకాల పరిశోధనలు చేసి  వాళ్ళు కనుక్కున్నదేమిటంటే, నిమ్మరసం కేన్సర్ కణాలను నాశనం చేస్తుందట. దీని ప్రభావం కిమోతెరఫి కంటే పదివేలరెట్లు ఎక్కువట.

ఇంత గొప్ప విషయం జనానికి ఎందుకు తెలియదంటే – దానికి కారణం ఔషదాలు తయారు చేసే లేబొరేటరీలేనట. నిమ్మరసాన్ని సింథటిక్ గా తయారుచేసి అమ్ముకుని, ఇబ్బడి ముబ్బడిగా లాభాలు గడించాలనే తాపత్రయంతో ప్రయోగాలను ముమ్మరం చేసే పనిలో అవి వున్నాయట.

అందుకని మనం ఇప్పుడేమి చేయాలట. మనకు తెలిసిన ఈ విషయాన్ని నలుగురికీ తెలియచేయాలి. కేన్సర్ తో బాధపడే వారికి నిమ్మరసం చేసే మేలు గురించి ప్రచారం చేయాలి. నోటికి రుచిగావుండే నిమ్మరసం తీసుకోవడం వల్ల రోగి శరీరంలో ఎలాటి విపరీత పరిణామాలు సంభవించవు. అదే కీమోతెరఫి తీసుకునే రోగులకు కలిగే భయంకరమయిన సైడ్ ఎఫెక్ట్స్ ఎలాటివో అందరికీ తెలిసిందే.

ఈ చిట్కా వైద్యం జనాలకు తెలియకపోవడం అనేది మామూలుగా జరిగిందా లేక కావాలని ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా వుంచారా అన్నది మరో రహస్యం. ఇది తెలిసిపోతే, పెద్ద పెద్ద ఔషధ సంస్తల లాభాలన్నీ ఏమైపోవాలి?

ఇంత పెద్ద రోగాన్ని నయం చేయగల ఔషధ లక్షణాలున్న నిమ్మకాయను రకరకాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మతొనలను తొనలుగా తీసి తినవచ్చు. రసం తీసుకుని తాగవచ్చు. నిమ్మరసంతో షర్బత్ చేసుకోవచ్చు. వంటిళ్లల్లో నిమ్మకాయతో ఆడవాళ్ళు చేసే వంటకాల జాబితా చిన్నదేమీ కాదు. నిమ్మకాయ కారం,నిమ్మకాయ మిరియం, నిమ్మకాయ పులిహార, నిమ్మకాయ చారు, నిమ్మకాయ పప్పు ఇలా తెలుగు లోగిళ్ళలో నిమ్మకాయ నమ్మకమయిన వంటకంగా వెలిగిపోతూ వుంటుంది. దీనిలో వున్న పోషక విలువలు గురించీ, రోగనిరోధక లక్షణాలు గురించీ తెలియనివాళ్ళు వుండరు. పైత్య హరణానికి ఆయుర్వేదంలో నిమ్మకాయకు వున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. పోతే, ఇప్పుడు బాల్టిమోర్ ప్రయోగశాల వారు నిమ్మకాయకు కేన్సర్ ని నయం చేసే లక్షణాలున్నాయని కనుక్కుని మరో మహోపకారం చేసారు.

సిస్ట్ లు, కణుతులు మీద నిమ్మరసం చూపే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదంటున్నారు బాల్టిమోర్ పరిశోధకులు. అన్ని రకాల కేన్సర్ లపై నిమ్మరసం బాగా పనిచేస్తున్నదన్న విషయం పరిశోధనల్లో నిర్ధారణ అయిందంటున్నారు.

బాక్టీరియా వల్ల కలిగే రోగాలకు ఇది సంజీవని మాదిరిగా పనిచేస్తుందని కూడా వారి ఉవాచ. శరీరంలో దాగివుండే క్రిములు, పరాన్న జీవులను నిర్మూలించే విషయంలో కూడా నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అంతే కాదు, అధిక రక్తపు పోటును అదుపులో వుంచడానికి కూడా నిమ్మ వైద్యం ప్రశస్తం అన్నది వారి పరిశోధనలలో తేలిందట. మానసిక వొత్తిడిని తగ్గించడంలో, నరాల సంబంధమయిన జబ్బులను నయం చేయడంలో సయితం నిమ్మరసం చేసే మేలు అమోఘం అంటున్నారు.

నిమ్మకాయ లో వున్న ఔషధ గుణాలు గురించి మన ఆయుర్వేదంలో ఏనాడో చెప్పారు కానీ, పాశ్చాత్య దేశాలవాళ్ళు చెబితేగాని నమ్మని వాళ్ళు ఎక్కువగావున్న దేశం కనుక, ఈ సమాచారాన్ని ఇచ్చింది ఎవరో చెప్పాల్సివస్తోంది. ప్రపంచంలో వున్న అతి పెద్ద ఔషధ తయారీ సంస్తకు చెందిన పరిశోధనాగారంలో 1970 నుంచి యిరవై లేబొరేటరీ పరీక్షలు జరిపి నిమ్మకాయకున్న ఔషధ విలువలు గురించిన ఈ విలువయిన సమాచారాన్ని బయట పెట్టారు.

ఈ పరిశోధనల సారాంశం ఏమిటంటే – నిమ్మరసం పన్నెండు రకాల కేన్సర్ కణాలను నాశనం చేస్తుందని. రొమ్ము కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, మొదలయినవి ఈ జాబితాలో వున్నాయి.

కీమోతెరఫీ లో అడ్రియామైసిన్ అనే దాన్ని సాధారణంగా వాడుతుంటారు. కేన్సర్ కణాలు త్వరితగతిన పెరిగిపోకుండా ఈ ఔషధం అరికడుతుంది. అయితే నిమ్మకాయలోని ఔషధ గుణాలవల్ల అడ్రియామైసిన్ కంటే పదివేల రెట్లు ఫలితం వుంటుందట.

మరో ఆశ్చర్యకరమయిన సంగతి ఏమిటంటే, నిమ్మరసంతో చేసే చికిత్స వల్ల కేన్సర్ కణాలు మాత్రమే నాశనం అవుతాయికాని ఆరోగ్యవంతంగా వున్న ఇతర కణాలకు ఎలాటి ప్రమాదం వుండదు.

ఈ పరిశోధనలు చేసి ఇంత విలువయిన సమాచారం అందించిన సంస్త వివరాలు ఇవిగో ఇవే:

Institute of Health Sciences, 819 N. L.L.C. Cause Street, Baltimore, MD1201











2 కామెంట్‌లు:

Prasanth చెప్పారు...

Thanks for the valuable information. vety usefull.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

thanks for your comment - bhandaru srinivasrao